ఈ-పాస్‌పోర్ట్‌ లను తీసుకుని రాబోతున్న భారత ప్రభుత్వం

Chip based e-Passport to be rolled out from 2022-23. పౌరుల సౌకర్యార్థం ప్రభుత్వం 2022-23 నుంచి ఇ-పాస్‌పోర్ట్‌లను అందుబాటులోకి

By Medi Samrat  Published on  2 Feb 2022 2:27 PM IST
ఈ-పాస్‌పోర్ట్‌ లను తీసుకుని రాబోతున్న భారత ప్రభుత్వం

పౌరుల సౌకర్యార్థం ప్రభుత్వం 2022-23 నుంచి ఇ-పాస్‌పోర్ట్‌లను అందుబాటులోకి తెస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రకటనలో తెలిపారు. E-పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టడం పౌరులకు మరింత సహాయపడేలా చేస్తుందని. పౌరుల భద్రతను మెరుగుపరుస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తుల గుర్తింపును నిర్ధారించడానికి ఇ-పాస్‌పోర్ట్‌లు రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID), బయోమెట్రిక్‌లను ఉపయోగిస్తాయి. చిప్ ఎంబెడెడ్ ఇ-పాస్‌పోర్ట్‌లు పాస్‌పోర్ట్ హోల్డర్ యొక్క వ్యక్తిగత డేటా --పేరు, బయోమెట్రిక్ వివరాలు వంటివి ఉంటాయి.

చిప్‌లో ట్యాంపరింగ్ జరిగితే, సిస్టమ్ దానిని గుర్తించగలదని, అలాంటి సందర్భంలో పాస్‌పోర్ట్ ప్రామాణీకరించబడదని నివేదిక పేర్కొంది. MEA సెక్రటరీ సంజయ్ భట్టాచార్య గతంలో తన ట్వీట్‌లో ఇ-పాస్‌పోర్ట్ గురించి ప్రస్తావించారు. నాసిక్‌కు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ పాస్‌పోర్ట్ జాకెట్‌ల కోసం ICAO-కంప్లైంట్ ఎలక్ట్రానిక్ చిప్ ఇన్‌లేస్ ఉత్పత్తికి కాంట్రాక్ట్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. చిప్‌తో నడిచే ఇ-పాస్‌పోర్ట్‌ల జారీకి ఈ కాంటాక్ట్‌లెస్ ఇన్‌లేలు అవసరం. సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాస్‌పోర్ట్‌ల జారీ ప్రారంభమవుతుంది. త్వరలో ప్రభుత్వం నుండి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.


Next Story