ఆన్‌లైన్‌ ‌లోన్ యాప్‌ల వెనుక చైనా మ‌హిళ హ‌స్తం..!

Chinese Woman Behind Money Lending Apps. ఇటీవ‌ల కాలంలో ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చే యాప్స్ తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి

By Medi Samrat  Published on  25 Dec 2020 5:33 AM GMT
ఆన్‌లైన్‌ ‌లోన్ యాప్‌ల వెనుక చైనా మ‌హిళ హ‌స్తం..!

ఇటీవ‌ల కాలంలో ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చే యాప్స్ తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ యాప్‌ల నుంచి రుణం తీసుకుని స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌డంతో.. వారు పెట్టే వేదింపులు భ‌రింక‌లేక ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లువురు ఆత్మ‌హ‌త్య పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ ఆన్‌లైన్ మనీ లెండింగ్ యాప్‌ల వెనక చైనా మహిళ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆమె ఈ యాప్‌ల సృష్టికర్త అని.. జనవరిలో ఇండియా వచ్చిన ఆమె హైదరాబాద్, గురుగ్రామ్, ఢిల్లీ తదితర నగరాల్లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. కరోనా వైర‌స్ విస్తరించ‌డంతో తిరిగి ఏప్రిల్ లో చైనా వెళ్లిపోయింది. అయితే.. అక్క‌డి నుంచే రుణ‌యాప్‌ల కార్య‌క‌లాపాల‌ను ఆమె ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. అస‌లు సూత్ర‌ధారుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. అంతేకాదండోయ్‌.. ఒక్కో లెండింగ్ యాప్‌లో 20 నుంచి 30 వరకు లింక్ యాప్‌లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని ఇటీవల ఢిల్లీలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై నిన్న నగరానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నగరంలో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రుణయాప్‌లకు సంబంధించి 279 బ్యాంకు ఖాతాల్లోని రూ.80 కోట్ల అనుమానాస్పద నిధులను గుర్తించి.. వాటి లావాదేవీలను నిలిపివేయాలంటూ ఆయా బ్యాంకులు, వ్యాలెట్లకు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు లేఖలు రాశారు.

రుణ‌యాప్‌ల ద్వారా న‌గ‌దు తీసుకున్న వారి నుంచి తిరిగి వ‌సూలు చేసే బాధ్య‌త పూర్తిగా కాల్‌సెంట‌ర్ల‌దే. రోజుకు రూ.20కోట్లు వ‌సూలు చేయాల‌నేది నిర్వాహ‌కులు నిర్దేశించిన ల‌క్ష్యం. ఒక్కో టెలీకాల‌ర్ నుంచి క‌నీసం 60 మందికి ఫోన్ చేయాలి. సొమ్ము వసూలు చేయ‌డానికి ఎలా మాట్లాడానా ఇబ్బంది లేద‌ని భ‌ఱోసా ఇస్తారు. దీంతో టెలికాల‌ర్స్ అస‌భ్య ప‌ద‌జాలంతో మాట్లాడుతూ.. రుణం తీసుకున్న వారిని మాన‌సికంగా హింసిస్తున్నార‌ని తెలుస్తోంది


Next Story