చైనా ఒక గ్రామాన్ని ఏకంగా భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో నిర్మించిందని అమెరికా ఇటీవల తన అంతర్గత నివేదికలో పేర్కొంది. అయితే ఇదే విషయమై భారత భద్రతా వర్గాలు స్పష్టతనిచ్చాయి. భారత్ - చైనా బార్డర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామం వివాదాస్పదంగా వెలిసింది. అయితే ఈ గ్రామం ఉన్న భూభాగం దాదాపు 60 సంవత్సరాలుగా చైనా దేశ ఆధీనంలోనే ఉందని భారత భద్రతా వర్గాలు తెలిపాయి. వివాదాస్పద గ్రామం వెలిసిన చోట భారత అస్సాం రైఫిల్స్ పోస్టు ఉండేది. దీనిని 1959లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమణకు గురి చేసింది. దీనిని లాంగ్జూ ఘటనగా పేర్కొంటారని.. అప్పటి నుండి ఈ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉందని భారత భద్రత వర్గాలు వెల్లడించాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దేశం గ్రామాన్ని నిర్మించిందంటూ అమెరికా తన నివేదికలో పేర్కొనడంతో గత కొన్ని రోజులుగా భారత్‌లో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. భారత నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో పక్కా ఇళ్లతో చైనా గ్రామం నిర్మించిందంటూ కొన్ని శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెక్ మెహన్ రేఖకు దక్షిణాన భారత బార్డర్‌లో ఈ గ్రామం ఉందని అమెరికా తన నివేదికలో పేర్కొంది. గత సంవతసరం జూన్‌లో గాల్వాన్ లోయ ఘర్షణను సైతం అమెరికా రక్షణ శాణ తన నివేదికలో పేర్కొంది. నలుగురు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు చైనా అవార్డులు ఇచ్చినట్లు ప్రస్తావించింది. ఈ ఘటనలో చైనా వైపు ఎంత మంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు