ఉప రాష్ట్రపతి వెంకయ్య పర్యటన.. విషం కక్కిన చైనా..!

China objects to Vice President Venkaiah's visit. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.వెంకయ్యనాయుడు పర్యటించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో

By అంజి  Published on  14 Oct 2021 3:30 AM GMT
ఉప రాష్ట్రపతి వెంకయ్య పర్యటన.. విషం కక్కిన చైనా..!

అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.వెంకయ్యనాయుడు పర్యటించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సమావేశాలను ఉద్దేశించి వెంకయ్య ప్రసంగించారు. అయితే వెంకయ్యనాయుడు పర్యటనపై భారత సరిహద్దు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంకయ్య పర్యటన పట్ల అభ్యంతరాన్ని తెలుపుతూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝూవో లీజియన్‌.. విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. ఇది ద్వైపాక్షి ఒప్పందాల ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ చైనా ఆరోపించింది. అయితే చైనా తీరును భారత్‌ తప్పుబట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో జాతీయ నాయకులు ఎవరు పర్యటించినా చైనా వ్యతిరేకిస్తుంటుంది.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొత్తం తమ భూభాగమే అంటూ చైనా చెప్పుకుంటూ వస్తోంది. అయితే చైనా అభ్యంతరానికి భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భాగమని స్పష్టం చేసింది. భారత ప్రముఖులు ఎప్పుడైనా అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తారని.. ఇందులో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను తమవిగా చూపించుకుంటూ చైనా తమ వరల్డ్ మ్యాప్‌లను రూపొందించుకున్నాయి. సరిహద్దు సమీపంలో ఓ గ్రామాన్ని నిర్మించిన చైనా... అక్కడ పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తోంది. దీనిని భారత్‌ పదే పదే వ్యతిరేకించినప్పటికి.. చైనా తన దుందుడుకు చర్యలు ఆపడం లేదు.

Next Story
Share it