పాఠ‌శాల‌లోని చెట్టుకు ఉన్న‌ పండ్లు తెంచి తిన్న 49 మంది పిల్లలు.. వారందరికీ ఒక్కసారిగా

Children fall ill after eating poisonous fruits, hospitalized. పిల్లలు ఏది పడితే అది కనిపిస్తే తింటూ ఉంటారు. అయితే ఇది కొన్ని కొన్ని సార్

By Medi Samrat  Published on  5 Dec 2021 9:19 AM GMT
పాఠ‌శాల‌లోని చెట్టుకు ఉన్న‌ పండ్లు తెంచి తిన్న 49 మంది పిల్లలు.. వారందరికీ ఒక్కసారిగా

పిల్లలు ఏది పడితే అది కనిపిస్తే తింటూ ఉంటారు. అయితే ఇది కొన్ని కొన్ని సార్లు చాలా ప్రమాదకరం. మధ్యప్రదేశ్‌లోని సియోనిలో 49 మంది చిన్నారులు విషపూరితమైన పండ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన పిల్లలు శనివారం నాడు కొన్ని కాయలు తిని ఆసుపత్రి పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం సియోని జిల్లాలోని బర్ఘాట్ ప్రాంతంలో అనారోగ్యం కారణంగా పిల్లలను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వారి ఆరోగ్యం మెరుగయ్యాక 49 మందిని తిరిగి ఇంటికి పంపించారు.

పాఠశాలలో రతంజోన్ చెట్టు ఉందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యార్థులు అదే చెట్టు నుండి పండ్లు కోసి తిన్నారు. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి తిరిగి రావడంతో వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని, భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు పిల్లలను బర్‌ఘాట్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ యోగేష్ అగర్వాల్ మాట్లాడుతూ, "పిల్లలు వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. చికిత్స తర్వాత వారి ఇళ్లకు తిరిగి పంపించాము" అని తెలిపారు. ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శివాని జిల్లా ఆసుపత్రికి పంపినట్లు డాక్టర్ అగర్వాల్ చెప్పారు. అలాంటి ఘటనే మరో ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బార్‌ఘాట్‌లో గురువారం ఆల్కనెట్ పండు తిని 13 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో వారిని కూడా ఆసుపత్రిలో చేర్చారు.


Next Story