అధికారిక ప్రకటన : తుదిశ్వాస విడిచిన జనరల్ బిపిన్ రావత్

Chief of Defence staff General Bipin Rawat dies in chopper crash in Tamil Nadu. తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.

By Medi Samrat  Published on  8 Dec 2021 12:50 PM GMT
అధికారిక ప్రకటన : తుదిశ్వాస విడిచిన జనరల్ బిపిన్ రావత్
తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య, ఉన్నతాధికారులు మొత్తం 14 మంది చనిపోయారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. 11 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని దగ్గర్లో ఉన్న వెల్లింగ్టన్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను కాపాడుకోడానికి వైద్యుల బృందం చాలా కష్టపడింది. అయితే ఆయనను కాపాడుకోలేకపోయారని తెలుస్తోంది.


"With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident," అంటూ భారత వైమానిక దళం ట్వీట్ చేసింది.

ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌ బుధ‌వారం సులూర్ నుంచి వెల్లింగ్ట‌న్‌కు వెళుతుండ‌గా కూనూర్ వ‌ద్ద కుప్ప‌కూలింది. హెలికాఫ్ట‌ర్ కూలిన స‌మ‌యంలో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలుముకుంది. ప్ర‌మాద ఘ‌ట‌నపై వాయుసేన ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఘ‌ట‌నాస్థ‌లిలో గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో మృత‌దేహాలు ఉన్నాయి.

వెల్లింగ్టన్‌లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కూనురు సమీపంలో కూలిపోయింది. బిపిన్‌ రావత్‌ మరణాన్ని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్య మ‌ధులిక‌తో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందిన‌ట్లు వాయుసేన ధృవీక‌రించింది. తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



Next Story