ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ దేశంలో ఏడాదిలోగా మధ్యంతర సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ఎంపీలు నరేంద్ర మోదీని తమ నాయకుడిగా, తదుపరి ప్రధానమంత్రిగా ఎంచుకున్న రోజునే బఘేల్ నుండి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి.. ఆరు నెలల నుండి ఒక సంవత్సరం మధ్య మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయని భూపేష్ బఘేల్ ఒక కార్యక్రమంలో అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది.. భజన్ లాల్ శర్మ ఊగిసలాడుతున్నారు, ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్నారని బఘేల్ అన్నారు. రోజుకు మూడుసార్లు బట్టలు మార్చుకునే వారు ఇప్పుడు ఒకే దుస్తులలో మూడు ఈవెంట్‌లకు హాజరవుతున్నారని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కాంగ్రెస్ నేత అన్నారు. 234 సీట్లను సాధించిన ఇండియా కూటమి, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నరేంద్ర మోదీకి నైతిక ఓటమిగా అంచనా వేసాయి.