ఛత్తీస్‌గఢ్‌లో గౌర-గౌరీ పూజ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సంప్రదాయం ప్రకారం కొరడాతో కొట్టించుకున్నారు. పండుగ రోజున కొరడా దెబ్బలు తింటే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఆ నమ్మకాలను పాటించే వారిలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా ఒకరు. తాజాగా ఆయన కొరడా దెబ్బలను తిని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
దుర్గ్ జిల్లాలో జానపద సంప్రదాయంలో భాగంగా ఆయన చేతిపై కొరడా ఝులిపించారు. చేతికి దెబ్బలు తగిలితే చెడును దూరం చేస్తుందని నమ్ముతారు. కొరడా దెబ్బలు తగిలినా... ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి చిరునవ్వు చెక్కుచెదరకుండా ఉండడం వీడియోలో చూడవచ్చు. ఆచారాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రిపై కొరడా ఝులిపించేందుకు ఏ మాత్రం జంకలేదు. చాలా మంది ఈ చర్యను మూఢనమ్మకంగా చెబుతున్నా, ఈ సంప్రదాయం సంవత్సరాలుగా కొనసాగుతోంది. సీఎం భూపేష్ బఘెల్ 2021లో కూడా ఈ ఆచారాన్ని పాటించారు.