రాముడి ఫోటో ఉన్న ప్లేట్లలో బిర్యానీ వడ్డన.. చెలరేగిన వివాదం

ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని ఒక బిర్యానీ అమ్మకందారుడు రాముడి ఫోటో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్‌లపై బిర్యానీ వడ్డించడంతో గందరగోళం చెలరేగింది.

By అంజి  Published on  23 April 2024 6:00 PM IST
biryani, disposable plates , Lord Rama, Delhi

రాముడి ఫోటో ఉన్న ప్లేట్లలో బిర్యానీ వడ్డన.. చెలరేగిన వివాదం

ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని ఒక బిర్యానీ అమ్మకందారుడు రాముడి ఫోటో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్‌లపై బిర్యానీ వడ్డించడంతో మంగళవారం నాడు గందరగోళం చెలరేగింది. ఆదివారం స్థానిక హిందూ సంస్థలు బిర్యానీ దుకాణంలో ఉంచిన ప్లేట్లపై రాముడి ఫోటోను గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బిర్యానీ ప్లేట్‌పై ఉన్న రాముడి ఫోటోను ఉపయోగించిన తర్వాత చెత్తలో పడేయడాన్ని గమనించిన వారు మొదట విక్రేతను ప్రశ్నించారు. విషయం తీవ్రరూపం దాల్చడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పోలీసులు సంఘటనా స్థలంలో రాముడి ఫోటో ఉన్న నాలుగు ప్లేట్ల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది. రాముడి ఫోటోలు ఉన్న ప్లేట్లలో విక్రేత బిర్యానీ వడ్డిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, బజరంగ్ దళ్ సభ్యులు ఆ ప్లేట్లలో బిర్యానీ విక్రయిస్తున్న దుకాణ యజమానిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణం చుట్టూ పెద్ద గుంపు కనిపించింది. ఆ వ్యక్తి వాటిపై శ్రీరాముడి చిత్రాలను కలిగి ఉన్న ప్లేట్ల కట్టలతో కనిపించాడు. ప్రస్తుతం జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్ ఈ మొత్తం కేసును విచారిస్తోంది.

Next Story