ఓ అమ్మాయిని అరెస్ట్ చేశారు.. అంతమంది అమ్మాయిల వీడియోలు లీక్ అవ్వలేదు: యూనివర్సిటీ

Chandigarh University girl held for 'leaking' obscene videos. హాస్టల్‌లోని విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను బహిరంగపరిచారంటూ

By Medi Samrat  Published on  18 Sept 2022 8:30 PM IST
ఓ అమ్మాయిని అరెస్ట్ చేశారు.. అంతమంది అమ్మాయిల వీడియోలు లీక్ అవ్వలేదు: యూనివర్సిటీ

హాస్టల్‌లోని విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను బహిరంగపరిచారంటూ చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా విద్యార్థినిని పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. హాస్టల్ అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో ఈ చర్య తీసుకున్నారు. అయితే ఒక్క 'లీక్' క్లిప్ మాత్రమే ఉందని, అది సిమ్లాలోని తన ప్రియుడికి నిందితురాలు పంపిన వ్యక్తిగత వీడియో అని యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం రాత్రి, లీకైన క్లిప్‌లపై మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో భారీ నిరసన మొదలైంది. విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియోలను మరో అమ్మాయి తన మొబైల్‌లో తీస్తోందని నిరసనకు దిగిన విద్యార్థులు ఆరోపించారు.

పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఓ అమ్మాయి తన హాస్టల్‌లో ఉన్న 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను సీక్రెట్‌గా తీసి, వాటిని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని వార్తలు వచ్చాయి. అమ్మాయిలు స్నానం చేస్తున్న క్లిప్‌లు ఆన్‌లైన్‌లో రావడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో యూనివర్సిటీలో కలకలం రేగింది. ఈ ఘటనతో హాస్టల్‌లోని అమ్మాయిలు షాక్‌కు గురయ్యారు. వీడియోలు లీక్‌ కావడంతో కొంత మంది విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. వీడియోల లీక్‌తో యూనివర్శిటీలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు దిగారు.




Next Story