చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల‌లో బీజేపీకి ఎదురుదెబ్బ‌.. స‌త్తా ఛాటిన కేజ్రీవాల్ పార్టీ

Chandigarh MC election 2021 result. చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ముగిసింది. ఈ ఎన్నిక‌ల‌లో

By Medi Samrat  Published on  27 Dec 2021 6:19 PM IST
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల‌లో బీజేపీకి ఎదురుదెబ్బ‌.. స‌త్తా ఛాటిన కేజ్రీవాల్ పార్టీ

చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ముగిసింది. ఈ ఎన్నిక‌ల‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 35 వార్డులలో 14 గెలిచి ముందంజలో నిలిచింది. భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నిక‌ల‌లో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ మేయర్ రవికాంత్ శర్మ ఆప్ అభ్యర్థి దమన్‌ప్రీత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన ఆప్ 14 వార్డులను గెలుచుకోగా, బీజేపీ 12, కాంగ్రెస్ 8 వార్డులను గెలుచుకున్నాయి. ఒక స్థానాన్ని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) గెలుచుకుంది.

ఫ‌లితాల‌పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. "ఆప్ తొలిసారిగా అక్కడ ఎన్నికల్లో పోటీ చేసింది. చండీగఢ్ ప్రజలు మాకు ఘన స్వాగతం పలికారు. ఇందుకు ప్రతి ఓటరు, పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని సిసోడియా అన్నారు. ఆప్ సీనియర్ నాయకుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. చండీగఢ్ ప్రజలు "కేజ్రీవాల్ సీఎంగా ఢిల్లీలో చేస్తున్న‌ పాలనకు మద్దతు ఇచ్చారని.. ఇక్కడ ప్రజలు కూడా అటువంటి పాల‌న‌నే అవలంబించాలని కోరుకుంటున్నారు" అని అన్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 60 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. 2016లో 26 వార్డులు ఉండగా.. ప్రస్తుతం 35 వార్డులు ఉన్నాయి.


Next Story