కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత.. ఫిబ్రవరి 14 నుండి స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం

Chandigarh lifts Covid restrictions.. schools to reopen from Feb 14. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు తగ్గడం ప్రారంభించినందున నగరంలో కోవిడ్ -19 ఆంక్షలను ఎత్తివేయాలని చండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on  10 Feb 2022 10:30 AM GMT
కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత..  ఫిబ్రవరి 14 నుండి స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు తగ్గడం ప్రారంభించినందున నగరంలో కోవిడ్ -19 ఆంక్షలను ఎత్తివేయాలని చండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ ఆర్డర్‌ను ఎత్తివేసింది. ఫిబ్రవరి 14 నుండి హైబ్రిడ్ మోడ్‌లో పూర్తి సామర్థ్యంతో అన్ని తరగతులకు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు పాఠశాలలను తిరిగి తెరవడానికి అనుమతించింది. "చండీఘర్ బర్డ్ పార్క్, రాక్ గార్డెన్ ఫిబ్రవరి 12 నుండి తిరిగి తెరవబడతాయి" అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తన తాజా అధికారిక ఉత్తర్వుల్లో అన్ని అవసర కార్యకలాపాల కోసం 12:30 నుండి ఉదయం 5 గంటల వరకు వ్యక్తుల కదలికలపై ఉన్న పరిమితులను తొలగించినట్లు పేర్కొంది.

నగరం గత 24 గంటల్లో 123 తాజా కోవిడ్ కేసులను నమోదు చేసిన సమయంలో ఈ ఆర్డర్ వచ్చింది. ఇది ఒక రోజు క్రితం 85 నుండి పెరిగింది. తాజా ఆర్డర్ శుక్రవారం నుండి అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది వర్తిస్తుంది. పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు ఫిబ్రవరి 14 నుండి తరగతులను పునఃప్రారంభించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

చండీగఢ్‌లో అనుమతించబడినవి, అనుమతించబడనివి ఇక్కడ ఉన్నాయి

అన్ని అవసర కార్యకలాపాల కోసం 12:30 నుండి ఉదయం 5 గంటల వరకు వ్యక్తుల కదలికలపై ఆంక్షలు తొలగించబడ్డాయి. ఫిబ్రవరి 14 నుండి అన్ని తరగతులకు హైబ్రిడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్)లో పూర్తి సామర్థ్యంతో పాఠశాలలు, కోచింగ్ సెంటర్‌లు పనిచేయడానికి అనుమతించబడతాయి. దీనికి సంబంధించి సవివరమైన ఉత్తర్వును వరుసగా చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్, విద్యా కార్యదర్శి జారీ చేస్తారు. చండీగఢ్ బర్డ్ పార్క్ మరియు రాక్ గార్డెన్‌లను ఫిబ్రవరి 12 నుండి తెరవడానికి అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

మార్కెట్లు, దుకాణాలు, అప్నీ మండీలు, సంస్థలు, మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, మ్యూజియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పాలు, ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ కారణంగా ఉన్న అన్ని పరిమితులు తొలగించబడ్డాయి. ఆర్డర్‌ల ప్రకారం, ఏదైనా ప్రయోజనం కోసం సమావేశాలు ఇంటి లోపల 200 మంది, ఆరుబయట 500 మంది వ్యక్తులకు పరిమితం చేయాలి. "ఈ ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని సెక్షన్ 51 నుండి 60 వరకు, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 ప్రకారం ఇతర వర్తించే చట్టాలతో పాటు చర్య తీసుకోవలసి ఉంటుంది" అని ఆర్డర్‌లో పేర్కొంది.

Next Story