పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాల‌కు కేంద్రం హెచ్చరిక

Centre's warning as Covid cases rise ahead of Independence Day. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  12 Aug 2022 3:16 PM IST
పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాల‌కు కేంద్రం హెచ్చరిక

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స్వాతంత్ర్య‌ దినోత్సవ వేడుకల సందర్భంగా భారీ సమావేశాలకు దూరంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని కొనసాగించాలని, చేతులను శుభ్రపరచుకోవాలని కేంద్రం కోరింది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రాలు కోవిడ్ -19 భద్రతా చర్యలను బలోపేతం చేయడం ప్రారంభించాయి.

ఢిల్లీ ప్రభుత్వం మాస్క్‌లను తప్పనిసరి చేయడంతో సహా ఈ ఆర్డర్‌ను ఉల్లంఘించిన వారికి ఒక్కొక్కరికి రూ. 500 జరిమానా విధించనున్న‌ట్లు పేర్కొంది. దేశంలో 16,561 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ పాజిటివిటీ రేటు 5.44% గా ఉంది. ఎక్కువ కేసులు ఢిల్లీ, ముంబైల‌లో న‌మోద‌య్యాయి. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 2,726 కొత్త‌ కేసులు నమోదయ్యాయి, ఇది దాదాపు ఏడు నెలల్లో అత్యధికం. పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉంది.


Next Story