నిధులు విడుద‌ల చేసిన కేంద్రం.. ఆంధ్ర‌, తెలంగాణ ప‌రిస్థితి ఏంటి..?

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది.

By Medi Samrat  Published on  10 Oct 2024 4:50 PM IST
నిధులు విడుద‌ల చేసిన కేంద్రం.. ఆంధ్ర‌, తెలంగాణ ప‌రిస్థితి ఏంటి..?

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే నెలవారీ పన్నుల వాటా రూ.89,086.50 కోట్లు కాకుండా ఈసారి రూ.1,78,173 కోట్ల మేర పన్నుల వాటా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులోనే ఒక నెల ముందస్తు చెల్లింపును కూడా చేర్చినట్టు తెలిపింది.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు రూ.31,962 కోట్ల మేర పన్నుల వాటా కేటాయించారు. బీహార్ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,987 కోట్లు, మహారాష్ట్రకు రూ.11,255 కోట్లు పన్నుల వాటా రూపంలో దక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో రూ.7,211 కోట్లు రాగా, తెలంగాణకు రూ.3,745 కోట్లు దక్కనున్నాయి.

1. ఆంధ్ర ప్రదేశ్ 7,211 కోట్లు

2 అరుణాచల్ ప్రదేశ్ 3,131 కోట్లు

3 అస్సాం 5,573 కోట్లు

4 బీహార్ 17,921 కోట్లు

5 ఛత్తీస్‌గఢ్ 6,070 కోట్లు

6 గోవా 688 కోట్లు

7 గుజరాత్ 6,197 కోట్లు

8 హర్యానా 1,947 కోట్లు

9 హిమాచల్ ప్రదేశ్ 1,479 కోట్లు

10 జార్ఖండ్ 5,892 కోట్లు

11 కర్నాటక 6,498 కోట్లు

12 కేరళ 3,430 కోట్లు

13 మధ్యప్రదేశ్ 13,987 కోట్లు

14 మహారాష్ట్ర 11,255 కోట్లు

15 మణిపూర్ 1,276 కోట్లు

16 మేఘాలయ 1,367 కోట్లు

17 మిజోరం 891 కోట్లు

18 నాగాలాండ్ 1,014 కోట్లు

19 ఒడిశా 8,068 కోట్లు

20 పంజాబ్ 3,220 కోట్లు

21 రాజస్థాన్ 10,737 కోట్లు

22 సిక్కిం 691 కోట్లు

23 తమిళనాడు 7,268 కోట్లు

24 తెలంగాణ 3,745 కోట్లు

25 త్రిపుర 1,261 కోట్లు

26 ఉత్తర ప్రదేశ్ 31,962 కోట్లు

27 ఉత్తరాఖండ్ 1,992 కోట్లు

28 పశ్చిమ బెంగాల్ 13,404 కోట్లు

Next Story