పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనపై ర‌గ‌డ‌

Centre orders Twitter, YouTube to pull down perfume ads with ‘rape jokes’. 'గ్యాంగ్ రేప్ సంస్కృతి'ని ప్రోత్సహిస్తున్న పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనపై

By Medi Samrat  Published on  4 Jun 2022 12:08 PM GMT
పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనపై ర‌గ‌డ‌

'గ్యాంగ్ రేప్ సంస్కృతి'ని ప్రోత్సహిస్తున్న పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

డీసీడ‌బ్ల్యూ ఈ విషయాన్ని సుమోటోగా గుర్తించి.. స‌ద‌రు పెర్ఫ్యూమ్ కంపెనీపై చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేప‌థ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, మాస్ మీడియా నుండి ప్రకటనను తొలగించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేయబడింది. జూన్ 9లోగా నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.

ప్రకటనలో నలుగురు అబ్బాయిలు గదిలోకి ప్రవేశించగా.. ఒక అబ్బాయి, అమ్మాయి జంట.. మంచం మీద కూర్చున్నారు. న‌లుగురిలో ఒకరు "షాట్ మారా లగ్తా హై! అంటాడు. ప్రతిస్పందనగా.. మంచం మీద ఉన్న అబ్బాయి "హాన్, మారా నా" అని అంటాడు. దీనికి మొదటి అబ్బాయి "అబ్ హుమారీ బారీ" అని చెప్పి, అసౌకర్యంగా ఉన్న అమ్మాయి వైపు కదులుతాడు. బాడీ స్ప్రే బాటిల్‌ని తీసుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి తేలికగా కనిపిస్తుంది.

అదే బ్రాండ్ మరొక ప్రకటనలో.. నలుగురు అబ్బాయిలు ఒక దుకాణంలో ఒక అమ్మాయిని వెంబడిస్తుంటారు. ఆమె వెనుక నిలబడి వారిలో ఒకరు.. "హమ్ చార్, ఔర్ యే ఏక్! షాట్ కౌన్ లెగా!" అని అంటాడు. దీనికి అమ్మాయి భయపడినట్లు కనిపిస్తోంది. అప్పుడు అబ్బాయిలలో ఒకరు బాడీ స్ప్రే బాటిల్‌ని తీసుకుంటాడు. అమ్మాయి ఉపశమనంతో నిట్టూర్పు విడుస్తుంది.

అత్యాచార సంస్కృతిని ప్రోత్సహించే ప్రకటనలను నివారించేవిధంగా నిర్దిష్ట తనిఖీలు చేయ‌డానికి పటిష్టమైన వ్యవస్థలను నిర్మించాలని స్వాతి మలివాల్ కేంద్రాన్ని కోరారు. ఇతర కంపెనీలు అలా చేయకుండా ఉండాలంటే బ్రాండ్‌పై భారీ జరిమానా విధించాలని ఆమె అన్నారు. నేను షాక్ అయ్యాను! మన టెలివిజన్ స్క్రీన్‌లలో ఎంత అవమానకరమైన, దయనీయమైన ప్రకటనలు అందించబడుతున్నాయి. విషపూరితమైన పురుషాధిక్యతను అత్యంత దారుణంగా ప్రచారం చేస్తూ, గ్యాంగ్ రేప్ సంస్కృతిని ప్రోత్సహించే ఈ సృజనాత్మక ప్రక్రియ ఏమిటి! ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రకటన ప్రసారం నిలిపివేయాలి. కంపెనీపై కఠినమైన జరిమానా విధించాలి. ఢిల్లీ పోలీసులు, ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ ఈ విషయంలో మరింత సమయం వృధా చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.




















Next Story