విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

Centre issues guidelines on unallocated power to prevent misuse by states. విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని

By Medi Samrat  Published on  12 Oct 2021 9:14 AM GMT
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ వాడుకోవాలని సూచించింది. కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ విక్రయిస్తున్నాయని.. వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్ అమ్ముకోకూడదని తెలుపుతూ.. ఎక్కువ ధర కోసం విద్యుత్ అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు కేటాయించని విద్యుత్ వాడుకునే వెసులుబాటు తొలగిస్తామ‌ని తెలిపింది. విద్యుత్ సరఫరా బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే గుర్తుచేసింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఆ విషయం మాకు తెలపాలని కోరింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని సూచించింది.


Next Story