19న శ్రీలంక సంక్షోభంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం

Centre calls another all-party meeting on Sri Lanka crisis on July 19. శ్రీలంకలో కొనసాగుతున్న పరిస్థితులపై కేంద్రం మంగళవారం అఖిలపక్ష

By Medi Samrat  Published on  17 July 2022 3:46 PM IST
19న శ్రీలంక సంక్షోభంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం

శ్రీలంకలో కొనసాగుతున్న పరిస్థితులపై కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజున జూలై 19న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశం గురించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరించారు.

"శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభంపై కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మ‌లా సీతారామన్ నేతృత్వంలో ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఏఐఏడీఎంకే నేత ఎం తంబి దురై, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు మాట్లాడుతూ.. శ్రీలంకలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని అన్నారు.

దేశం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున భారత్ శ్రీలంకకు ఇంధనం, రేషన్ సరఫరాలో సహాయం చేస్తోంది. శ్రీలంకకు భారత్ 3.8 బిలియన్ డాలర్లు సాయం చేసింద‌ని కేంద్ర‌మంత్రి జైశంకర్ చెప్పారు. శ్రీలంక రైతులకు సహాయం చేయడానికి విస్తరించిన క్రెడిట్ లైన్ కింద భారతదేశం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను కూడా అందజేసింది.















Next Story