సైబర్ మోసగాళ్లకు కేంద్రం షాక్..83 వేల వాట్సాప్ ఖాతాలు, 8 లక్షల సిమ్ కార్డులు బ్లాక్

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) భారీ "డిజిటల్ స్ట్రైక్" చేపట్టింది.

By -  Knakam Karthik
Published on : 30 March 2026 3:34 PM IST

Crime News, National News, Delhi, Cyber Security, Digital Strike, MHA, CyberCrimeIndia

సైబర్ మోసగాళ్లకు కేంద్రం షాక్..83 వేల వాట్సాప్ ఖాతాలు, 8 లక్షల సిమ్ కార్డులు బ్లాక్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్టులు' మరియు పెట్టుబడి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) భారీ "డిజిటల్ స్ట్రైక్" చేపట్టింది. ఈ ఉక్కు చర్యల్లో భాగంగా 2025 ప్రారంభం నుండి ఇప్పటివరకు మోసాలకు పాల్పడుతున్న 83,867 వాట్సాప్ ఖాతాలను, 3,962 స్కైప్ ఐడీలను అధికారులు బ్లాక్ చేశారు. టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT), పోలీసు యంత్రాంగం మరియు టెలికాం సంస్థల సమన్వయంతో సాగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా గుర్తించిన 8.45 లక్షల సిమ్ కార్డులను, 2.39 లక్షల మొబైల్ IMEI నంబర్లను నిలిపివేశారు.

వీటితో పాటు 827 హానికరమైన మొబైల్ యాప్‌లను నిరోధించడమే కాకుండా, సహ్యోగ్ పోర్టల్ ద్వారా 1.11 లక్షలకు పైగా అనుమానాస్పద ఆన్‌లైన్ కంటెంట్‌ను తొలగించారు. సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను మరియు వారి డిజిటల్ మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా పౌరులను ఆర్థిక, మానసిక దోపిడీల నుండి రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రియల్-టైమ్ యంత్రాంగాన్ని అమలు చేస్తోంది.

Next Story