పండగల వేళ జాగ్రత్త.. కరోనాపై అలసత్వం వద్దు : కేంద్రం
Central Govt Alert States Due to Increasing Corona Cases. పండగల సీజన్లో కరోనా కట్టడిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత
By Medi Samrat Published on 28 Aug 2021 5:09 PM GMTపండగల సీజన్లో కరోనా కట్టడిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. రద్దీ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పలు జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని.. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్చలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. జనాలు పెద్దగా గుమిగూడకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం అమలవుతున్న కరోనా మార్గదర్శకాలను సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితి జాతీయ స్థాయిలో స్థిరంగానే ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కేసుల పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. పలు జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని అన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాశారు. కేసులు అధికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీల యంత్రాంగాలు.. కట్టడి చర్యలు చేపట్టాలి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్చలు తీసుకోవాలి. కేసుల పెరుగుదలను ముందుగానే గుర్తించి.. వ్యాప్తిని అరికట్టాలి. ఇందుకోసం ఆరోగ్య శాఖ సూచించిన క్షేత్రస్థాయి విధానాలు అవలంబించాలని అజయ్ భల్లా అన్నారు.
కరోనా నిబంధనలు అమలు చేయడంలో కొంత అలసత్వం కనిపిస్తోందని భల్లా అన్నారు. కరోనాను నివారించడంలో ఈ నిబంధనలను సమర్థంగా అమలు చేయడమే కీలకమని చెప్పారు. టీకా పంపిణీలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకొని.. అర్హులందరికీ టీకా అందేలా చూడాలని సూచించారు.