కేంద్రం కీలక నిర్ణ‌యం.. రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్‌

Center Free Vaccine Supplies To States. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తయారీ సంస్థల నుంచి

By Medi Samrat  Published on  24 April 2021 8:02 AM GMT
కేంద్రం కీలక నిర్ణ‌యం.. రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్‌

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఒక డోసు వ్యాక్సిన్‌ను రూ.150కు కొనుగోలు చేసి.. ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదిలావుంటే.. ఇటీవ‌ల ఓ టీకా తయారీ సంస్థ కేంద్రానికి ఒక్క‌ డోసును రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.600కు సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో వ్యాక్సిన్ల ధరలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్ల ధరలపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్‌కు రూ.400 చెల్లించడం అంటే.. అమెరికా, యూకే, ఈయూ, సౌదీ, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా చెల్లించే దానికంటే ఎక్కువ అన్నారు. మేడిన్‌ ఇండియా టీకాకు అత్యధిక ధరనా? అని ప్రశ్నించారు.

ఈ నేఫ‌థ్యంలోనే జైరాం రమేశ్‌ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ కేంద్రం వ్యాక్సిన్లపై స్పష్టతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక డోసు వ్యాక్సిన్‌ను తయారీ సంస్థల నుంచి రూ.150కు కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇస్తున్న విధంగా ఉచితంగానే ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది.



Next Story