జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!

దేశ జనాభా ఎంత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విష‌యం. జనాభా లెక్కల పనులు చాలా ఏళ్లుగా నిలిచిపోయాయి.

By Medi Samrat  Published on  28 Oct 2024 1:36 PM GMT
జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!

దేశ జనాభా ఎంత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విష‌యం. జనాభా లెక్కల పనులు చాలా ఏళ్లుగా నిలిచిపోయాయి. ఆలస్యం అయిన జనాభా గణనకు సమయం ఆసన్నమైంది. వార్తా సంస్థ PTI అధికారిక మూలాల ప్రకారం.. జనాభా గణన 2025 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2026 నాటికి డేటా ప్రకటించబడుతుంది. సాధారణ జనాభా గణనతో పాటు కుల గణన కూడా నిర్వహించాలా వద్దా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1951 నుండి దేశ జనాభా ప్రతి 10 సంవత్సరాలకు లెక్కించబడుతుంది. అయితే COVID-19 మహమ్మారి కారణంగా జనాభా గణనను 2021లో నిర్వహించడం సాధ్యం కాలేదు.

వచ్చే ఏడాది ప్రారంభంలో జనాభా గణన.. ఎన్‌పిఆర్ పనులు ప్రారంభించి 2026 నాటికి జనాభా గణాంకాలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు జనాభా లెక్కల ప్రక్రియలో మార్పు వచ్చే అవకాశం ఉంది. త‌ర్వాత గ‌ణ‌న 2025-2035లో ఆ తరువాత 2035-2045 భవిష్యత్తులో కూడా 10 ఏళ్ల గ్యాప్‌తో జరుగుతుంది.

రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ కార్యాలయం.. జనాభా గణన సమయంలో పౌరులను అడగడానికి 31 ప్రశ్నలను సిద్ధం చేసింది. ఈ ప్రశ్నలలో మునుపటి జనాభా గణనలో అడిగిన ప్రశ్నల మాదిరిగానే ఇంటి పెద్ద షెడ్యూల్డ్ కులానికి చెందినవాడా లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినవాడా.. ఇతర వ‌ర్గాల‌ అనేవి కూడా ఉన్నాయి.

జనాభా లెక్కల ప్రకారం ప్రతి కుటుంబానికి అడిగే 31 ప్రశ్నల్లో ఇవి ఉన్నాయి..

కుటుంబంలో సాధారణంగా నివసించే వ్యక్తుల మొత్తం సంఖ్య ఎంత?

కుటుంబ పెద్ద మహిళనా?

కుటుంబానికి ఎన్ని గదులు ఉన్నాయి?

కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య ఎంత‌?

ఇంట్లో టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్, సైకిల్, స్కూటర్ లేదా మోటార్ సైకిల్ లేదా మోపెడ్ ఉందా మరియు కారు, జీప్ లేదా వ్యాన్ కలిగి ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.

ఇంట్లో ఏ ధాన్యాలు తింటారు, తాగునీటికి ప్రధాన వనరు, మరుగుదొడ్డి యాక్సెస్, టాయిలెట్ రకం, వ్యర్థ జలాల అవుట్‌లెట్, స్నానపు సౌకర్యాల లభ్యత గురించి కూడా అడుగుతారు.

వంటగది, LPG/PNG కనెక్షన్ లభ్యత, వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ లభ్యత మొదలైన వాటి గురించి కూడా ప్రశ్నలు ఉంటాయి.

దేశంలోని మొత్తం OBC జనాభాను తెలుసుకోవడానికి కుల గణనను డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలలో ప్రతిపక్ష కాంగ్రెస్, RJD కూడా ఉన్నాయి. కుల గణనపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక అధికారి తెలిపారు. జనాభా లెక్కల సమాచారం వెలువడిన తర్వాత ప్రభుత్వం 2026లో జరగాల్సిన డీలిమిటేషన్ కసరత్తుతో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా మంది రాజకీయ నాయకులు తమ రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలను కోల్పోతాయని.. కొత్త డేటాతో డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుత నియోజకవర్గాల కంటే తక్కువ సంఖ్యలో పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story