తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాద ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణించగా, 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఒకరు 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని తెలుస్తోంది. ఘటనాస్థలిలో గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయని తెలుస్తోంది. డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను కూనూరు ఎయిర్‌బేస్‌లోని వెల్లింగ్‌టన్ ఆస్పత్రికి తరలించారు.
అదే ఆస్పత్రిలో రావత్‌కు ముగ్గురు డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల సమయంలో బిపిన్‌రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటనలో హెలిక్యాప్టర్ మంటల్లో కాలి బూడిదైపోయింది. దాంతో అందులోని 11 మంది సజీవ దహనమయ్యారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రమాదం వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. రాజ్‌నాధ్ సింగ్ ఢిల్లీలో బిపిన్ రావత్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.