వైర‌ల్ అవుతున్న వీడియో.. సోనాలి ఫోగట్‌కు డ్రగ్స్ ఇచ్చారా..?

CCTV Shows Sonali Phogat Forced To Drink At Club Hours Before Death. బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ చనిపోయే కొన్ని గంటల ముందు గోవా క్లబ్‌లో

By Medi Samrat  Published on  27 Aug 2022 8:02 PM IST
వైర‌ల్ అవుతున్న వీడియో.. సోనాలి ఫోగట్‌కు డ్రగ్స్ ఇచ్చారా..?

బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ చనిపోయే కొన్ని గంటల ముందు గోవా క్లబ్‌లో ఆమె సహాయకులలో ఒకరు ఆమెకు బలవంతంగా ఒక డ్రింక్ ఇచ్చారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఆమె సహాయకులలో ఒకరు.. కేసులో నిందితుడు.. సుధీర్ సగ్వాన్, సోనాలి ఫోగట్‌కు బాటిల్‌లో నుండి డ్రగ్స్‌ను బలవంతంగా ఇవ్వడం కనిపిస్తుంది. సోనాలి ఫోగట్ కూడా సుధీర్‌ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.. కానీ ఆమె అనుకున్నది జరగలేదు.

తొలుత గుండెపోటుతో మరణించినట్లు భావించగా.. తరువాత సోనాలిది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో గోవా పోలీసులు మర్డర్‌ కేసు నమోదు చేశారు. సోనాలికి పార్టీలో డ్రగ్స్‌ ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. గోవా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ శుక్రవారం మీడియాకు విషయాలు వెల్లడించారు. సోనాలి ఫోగట్ మరణానికి ముందు అంజునాలో జరిగిన పార్టీలో ఆమెకు తన ఇద్దరు సహచరులు మత్తుమందు ఇచ్చినట్లు తేలిందన్నారు. రసాయన పదార్ధాలను కలిపిన డ్రింక్‌ను ఆమెతో బలవంతంగా తాగించారని పేర్కొన్నారు.

డ్రింక్‌ తాగిన తర్వాత ఆమె తనపై తాను కంట్రోల్‌ తప్పిందని.. సోనాలి నియంత్రణ కోల్పోవడంతో ఉదయం 4.30 నిమిషాలకు ఆమెను టాయిలెట్‌లకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే తరువాత రెండు గంటలపాటు ఏం జరిగిందనే దానిపై వివరణ లేదన్నారు. నిందితులిద్దరూ ఆమె హత్యకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ ఆగస్టు 22న ఫోగట్‌తో కలిసి గోవాకు వెళ్లారని, అంజునాలోని కర్లీస్ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నారు.


Next Story