మార్చి 15న తన ముందు విచారణకు హాజరు కావాలని తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తాజాగా సమన్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాట ఘటనపై ఈ విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
తొలుత ఈ కేసును విచారణకు రావాలని మార్చి 10 (మంగళవారం) నాడే సీబీఐ సమన్లు ఇచ్చింది. అయితే, ప్రస్తుత రాజకీయ కార్యక్రమాలు మరియు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తనకు 15 రోజుల సమయం కావాలని, అలాగే విచారణను ఢిల్లీలో కాకుండా చెన్నై లేదా తమిళనాడులోని ఏదైనా ప్రాంతంలో నిర్వహించాలని విజయ్ కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన సీబీఐ, తాజాగా మార్చి 15న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి రావాలని స్పష్టం చేస్తూ కొత్త సమన్లు జారీ చేసినట్లు సమాచారం.