అందరూ చూస్తుండగానే పోలీసుల మీద తూటాల వర్షం

Caught On CCTV, 2 Cops Shot Dead By Terrorist At Srinagar Tea Stall. శ్రీనగర్ లో ఓ టెర్రరిస్టు పట్టపగలు రెచ్చిపోయాడు.

By Medi Samrat  Published on  19 Feb 2021 11:59 AM GMT
2 Cops Shot Dead By Terrorist At Srinagar Tea Stall

శ్రీనగర్ లో ఓ టెర్రరిస్టు పట్టపగలు రెచ్చిపోయాడు. బఘాట్ ప్రాంతంలోని టీస్టాల్ వద్ద అందరూ చూస్తుండగానే పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. దుస్తుల్లో తుపాకీ దాచుకుని వచ్చిన ముష్కరుడు.. కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో సొహైల్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా... మహ్మద్ యూసుఫ్ అనే మరో కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విమానాశ్రయం రోడ్డులో ఉండే బఘాల్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాది కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. ఈ కాల్పుల ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది.


కాల్పుల ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. టెర్రరిస్టు కోసం ముమ్మర గాలింపును చేపట్టాయి. మూడు రోజుల వ్యవధిలో కాల్పులు జరగడం ఇది రెండోసారి. గత బుధవారం నాడు దుర్గనాగ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ యజమాని కుమారుడిపై కాల్పులు జరపగా గాయాలతో అతను బయటపడ్డారు. తాజాగా మరోసారి ఉగ్రవాదులు ఇలా తెగబడ్డంతో శ్రీనగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలా ఎంతో పవర్ ఫుల్ ఆయుధాలను బహిరంగంగా పట్టుకుని తిరుగుతూ ఉండడం కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.


Next Story
Share it