దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం: ఖర్గే
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం..అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం: ఖర్గే
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం..అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి. 1976లో ఇందిరాగాంధీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేశారు. 2015లో మోడీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తిరిగి సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మళ్లీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి. రాష్ట్రాల్లో రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలి. తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఎప్పటికైనా న్యాయ పరీక్షలు మధ్యే ఉన్నాయి. రాష్ట్రాల్లో రిజర్వేషన్లను ఆర్టికల్ 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. తద్వారా 50 శాతం పరిధిని తొలగించి వాటికి చట్టపరమైన భద్రత ఇవ్వవచ్చు..అని ఖర్గే పేర్కొన్నారు.
2006లో ఆర్టికల్ 15 (5) సవరణ ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల్లో SC, ST, OBCలకు రిజర్వేషన్లు కల్పించేలా చట్టం వచ్చిందని 2014లో సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. నేడు 55% ఉన్నత విద్యా సంస్థలు ప్రైవేట్ హస్తాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేద వర్గాల విద్యార్థులు ఎలా చదువుతారు? ఈ హక్కును చట్టబద్ధంగా అమలు చేయాలి – ఇదే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి!. మహిళా రిజర్వేషన్ తక్షణమే అమలులోకి రావాలి. రెండు సంవత్సరాల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది. SC, ST, OBC మహిళలకు కూడా ఒక మూడవ వంతు రిజర్వేషన్ ఉండాలంటూ డిమాండ్ చేసింది. ఈ ఐదు డిమాండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లోనూ, బయట కూడా పట్టు విడవకుండా పోరాడుతుంది..అని ఏఐసీసీ చీఫ్ పేర్కొన్నారు.