కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో పాటు మరో ఐదుగురు కంపెనీ అధికారులపై ముంబై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. "కోర్టు ఆదేశాల మేరకు, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు మరో ఐదుగురు కంపెనీ అధికారులపై కేసు నమోదు చేయబడింది" అని ముంబై పోలీసులు తెలిపారు. యూట్యూబ్‌లో తన సినిమా 'ఏక్ హసీనా తీ ఏక్ దీవానా థా' అప్‌లోడ్ చేయడానికి అనధికార వ్యక్తులను గూగుల్ అనుమతించిందని చిత్ర దర్శకుడు సునీల్ దర్శన్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది.
కోర్టు ఆదేశాల మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మరో ఐదు కంపెనీల అఫిషియల్స్‌పై Copyright Act violation కింద కేసు రిజిస్టర్ చేశామని ముంబై పోలీసులు తెలిపారు. సునీల్ దర్శకత్వం వహించిన Ek Haseena Thi Ek Deewana Tha అనే సినిమాను యూట్యూబ్‌లో అనధికారికంగా అప్‌లోడ్ చేయడాన్ని గూగుల్ అనుమతించిందని ఆరోపించాడు. దీంతో గూగుల్ కంపెనీ సీఈవోపై సునీల్ ముంబైలో ఫిర్యాదు చేయగా వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.