వ్యాక్సిన్ వద్దనుకున్న వాళ్లను బలవంతం చేయం

Cant force people to take vaccine if they dont want to. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చేశాయి పలు ఫార్మా

By Medi Samrat  Published on  22 Dec 2020 10:56 AM GMT
వ్యాక్సిన్ వద్దనుకున్న వాళ్లను బలవంతం చేయం

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చేశాయి పలు ఫార్మా కంపెనీలు..! పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ సరఫరా మొదలుపెట్టేశారు. భారత్ లో కూడా అధికారులు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన పంపిణీ కార్యక్రమాల కోసం సన్నాహకాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వడం మా బాధ్యతగా పరిగణిస్తున్నామనీ, కానీ ఎవరైనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఇష్టపడకపోతే అలాంటి వారిని బలవంతం చేయబోమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాలను దూరం చేయడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. భారత్‌లో వచ్చే ఏడాది జనవరిలో కరోనా వైరస్‌ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చేపడతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నామని అన్నారు. జనవరి నెల ఏ వారంలో అయినా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావొచ్చనని చెప్పారు.

భారత్ లో కరోనా మహమ్మారి మరీ మునుపటిలా ప్రబలకున్నా జనాలు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను పాటించడం మరవకూడదని సూచించారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ను రానున్న ఆరు-ఏడు నెలల కాలంలో దాదాపు 30 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ ద్వారా మన దేశ శాస్త్రవేత్తలు దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. కోటికి పైగా కేసులు మన దేశంలో నమోదైనప్పటికీ, రికవరీ రేటు విషయంలో భారత్‌ చాలా ముందుందని అన్నారు.


Next Story