ఏడాది పొడవునా విమాన చార్జీలపై పరిమితి విధించడం సాధ్యం కాదు

పండుగల సమయంలో విమాన టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరగడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో.. ఏడాది పొడవునా విమాన చార్జీలపై పరిమితి విధించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

By -  Medi Samrat
Published on : 12 Dec 2025 6:37 PM IST

ఏడాది పొడవునా విమాన చార్జీలపై పరిమితి విధించడం సాధ్యం కాదు

పండుగల సమయంలో విమాన టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరగడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో.. ఏడాది పొడవునా విమాన చార్జీలపై పరిమితి విధించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిమాండ్‌, సీజన్‌ను బట్టి ఛార్జీలు మారుతాయని, కాబట్టి ఏడాది మొత్తానికి పరిమితి విధించడం ఆచరణాత్మకం కాదని ప్రభుత్వం చెబుతోంది.

పండుగలు లేదా పీక్ పీరియడ్స్ సమయంలో సహజంగానే విమాన టిక్కెట్ ధరలు పెరుగుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు లోక్ సభకు తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. మొత్తం సంవత్సరానికి నిర్ణీత పరిమితిని విధించడం సాధ్యం కాదు. డిమాండ్ పెరిగినప్పుడు.. ఛార్జీలు కూడా పెరుగుతాయని.. అందువల్ల అలాంటి సమయంలో విమానాల సంఖ్యను పెంచాలని మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు.

టికెట్ ఛార్జీలను సర్దుబాటు, సహేతుకమైన పరిధిలో ఉంచడమే మంత్రిత్వ శాఖ ప్రయత్నమని మంత్రి చెప్పారు. దీని కోసం, విమానయాన సంస్థలు సామర్థ్యాన్ని పెంచాలని, కొత్త విమానాలను జోడించాలని, ప్రయాణీకుల-భద్రతా నియమాలను అనుసరించాలని సూచించబడ్డాయని వెల్ల‌డించారు. ఇటీవలి కార్యాచరణ సమస్యల కారణంగా దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన విమాన షెడ్యూల్‌ను తగ్గించుకోవాల్సిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ప్రయాణీకులకు ఎంపికలను అందించడానికి మార్గాలు, విమాన సామర్థ్యాన్ని నిరంతరం పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Next Story