దావూద్ గ్యాంగ్ పేరుతో ప్ర‌ధాని మోదీ, యూపీ సీఎం యోగిల‌ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తానంటూ

By Medi Samrat  Published on  21 Nov 2023 7:20 PM IST
దావూద్ గ్యాంగ్ పేరుతో ప్ర‌ధాని మోదీ, యూపీ సీఎం యోగిల‌ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తానంటూ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి బెదిరింపు కాల్స్ చేశాడు. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ లను హత్య చేసేందుకు పథకం రచించాల్సిందిగా దావూద్ ముఠా తనకు సూచించిందని ఫోన్ కాల్ లో తెలిపాడు. ఈ కాల్ ను సీరియస్ గా తీసుకున్న అధికారుల నిందితుడిని అరెస్టు చేశారు. జేజే హాస్పిటల్‌ను కూడా పేల్చివేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 505 (2) కింద కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. “దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశాం. ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని చంపేయమని దావూద్ ముఠా తనకు చెప్పిందని.. JJ హాస్పిటల్ ను కూడా పేల్చివేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. IPC సెక్షన్ 505 (2) కింద కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు.

ఆగస్టులో కేరళలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తన స్నేహితుడిని ఇరికించాలని ఇలా లేఖ రాశాడు. అక్టోబర్ 6న గోరేగావ్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో తాను పాకిస్థానీ అని.. నగరంలో త్వరలో బాంబు దాడులు జరగనున్నాయని హెచ్చరిస్తూ పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశాడు.

Next Story