ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి విష‌య‌మై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాల్పులు, విధ్వంసం జ‌రిగింది.

By Medi Samrat  Published on  18 March 2025 7:17 PM IST
ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి విష‌య‌మై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాల్పులు, విధ్వంసం జ‌రిగింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నలు లేవనెత్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 300 సంవత్సరాల క్రితం మరణించారని అన్నారు. కావాలంటే ఆయన సమాధిని తీసేయొచ్చు కానీ అంత‌కుముందు చంద్రబాబు, నితీష్‌ కుమార్‌లకు ఒక‌సారి ఫోన్‌ చేయండి’ అని చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి ఇద్దరూ బీజేపీకి కీలక మిత్రులు.. రెండు రాష్ట్రాలలో కూడా ముస్లీం జనాభా ఉంది. ఔరంగజేబు నిజానికి గుజరాత్‌లో పుట్టాడని, మహారాష్ట్రలోని భింగర్ సమీపంలో మరణించాడని థాకరే బీజేపీపై విరుచుకుపడ్డారు.

మంగళవారం నాగ్‌పూర్‌లో జరిగిన హింసాకాండకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ కారణమని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే ఆరోపించారు. మహారాష్ట్ర మంత్రి రాణే మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ముందస్తుగా ప్లాన్ చేసిన హింస అని అన్నారు. నితీష్ రాణే విలేకరులతో మాట్లాడుతూ.. నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘటనలకు అబూ అజ్మీ కారణమని అన్నారు. ఈ సమస్యను ప్రారంభించింది ఆయనే. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇది ముందస్తు ప్రణాళిక. పోలీసులపై చేతులు ఎత్తిన వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.

నాగ్‌పూర్ హింసాకాండపై, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. నేను ముఖ్యమంత్రిని కాదు.. హోంమంత్రిని కాదు.. హింస వెనుక ఎవరున్నారో ముఖ్యమంత్రిని అడగండి.. అక్కడ RSS ప్రధాన కార్యాలయం ఉంది.. ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విఫలమైతే.. వారు రాజీనామా చేయాలి.. మీకు కావాలంటే.., మీరు ఆయ‌న‌ (ఔరంగజేబు) సమాధిని తొలగించవచ్చు.. కానీ అంత‌కుముందు చంద్రబాబు నాయుడు.. నితీష్ కుమార్‌లను పిలవండని బీజేపీని దుయ్య‌బ‌ట్టారు.

Next Story