మిస్డ్ కాల్‌తో స్నేహం.. ఆపై కేఫ్‌లో అత్యాచారం.. అసభ్యకరమైన వీడియో తీసి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీలో కేఫ్ నిర్వాహకుడు బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:09 AM ISTమిస్డ్ కాల్‌తో స్నేహం.. ఆపై కేఫ్‌లో అత్యాచారం.. అసభ్యకరమైన వీడియో తీసి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీలో కేఫ్ నిర్వాహకుడు బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు. అసభ్యకరమైన వీడియోలు తీసి ఆమెను శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో.. కేఫ్ నిర్వాహకుడు ఆమెకు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అబార్షన్ చేయించాడు. ఆపై పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో తన వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేఫ్ నిర్వాహకుడిపై కేసు పెట్టింది.
2024 ఆగస్టులో తన మొబైల్‌కి తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాలిక పోలీసులకు తెలిపింది. మాట్లాడేందుకు నిరాకరించినా.. మళ్లీ మళ్లీ కాల్ రావడంతో.. ఎత్తి మాట్లాడగా.. కాల్ చేసిన వ్యక్తి తన పేరు అశోక్ బాఘెల్ అని చెప్పాడు. తాను కేకే నగర్ సికంద్రా నివాసి అని తెలిపాడు. తనకు సెక్టార్ 12 ఆవాస్ వికాస్ కాలనీలో కేఫ్ ఉందని పేర్కొన్నాడు. ఆపై స్నేహం పెరిగింది. ఈ క్రమంలోనే 2024 సెప్టెంబరు 6న అశోక్ బాఘెల్ తనను తన కేఫ్‌కు పిలిచాడని బాలిక చెప్పింది. అక్కడ అతడు తనకు శీతల పానీయం ఇవ్వగా.. అది తాగి తాను అపస్మారక స్థితికి చేరుకున్నానని.. ఆపై అశోక్ తనపై అత్యాచారం చేసి.. అతడి మొబైల్‌తో అపస్మారక స్థితిలో పడి ఉన్న తనను వీడియోలు తీశాడు. స్పృహలోకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెళ్తుండగా అశోక్ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది.
వివరాల ప్రకారం.. కేఫ్ నిర్వాహకుడి శారీరక వేధింపుల వల్లే ఆమె రెండు నెలల గర్భవతి అయింది. అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత నిందితుడు ఆమెకు మందులు ఇచ్చి అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో నిందితుడు తన అసభ్యకరమైన వీడియోను బయటపెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. పెళ్లికి నిరాకరించాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు కేకే నగర్ సికంద్రా నివాసి అశోక్ బాఘేల్‌పై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జగదీష్‌పురా ఆనంద్ వీర్ సింగ్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.