ఆ భయంతోనే విషం తిన్న వ్యాపారవేత్త..
Businessman eats poison for fear of corona virus and lock down. దేశంలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో ఎక్కడ దేశంలో
By Medi Samrat
దేశంలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో ఎక్కడ దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోననే భయం ప్రజల్లో ఉంది. ఇంతకు ముందు విధించిన లాక్ డౌన్ ల కారణంగా వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ కారణంగా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయనే కథనాలు మీడియా సంస్థలు టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. దీంతో వ్యాపారం మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలకు కొత్త టెన్షన్ మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఒక వ్యాపారి కరోనా వైరస్ భయం.. లాక్ డౌన్ లో జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
మట్గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరగన్యకు చెందిన వస్త్ర వ్యాపారి అన్షుల్ శర్మ విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. గ్రామంలో బట్టల దుకాణం నడుపుతున్నట్లు అన్షుల్ చెప్పాడు. కరోనా వైరస్ యొక్క మొదటి, రెండో వేవ్ లాక్డౌన్ అతనికి చాలా నష్టాలను కలిగించాయి. మూడవ వేవ్ వస్తుందేమో.. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే భయం మరింత పెరిగింది. దీంతో ఆత్మహత్యకు ఇంట్లో ఉంచిన ఎలుకల మందు తాగాడు. అన్షుల్‌కి మంజులతతో రెండేళ్ల క్రితం వివాహమైనట్లు సమాచారం. ఆమెకు రెండు నెలల కూతురు కూడా ఉంది. నానాటికీ పెరిగిపోతున్న నష్టాలను ఎలా భర్తీ చేస్తారో అర్థం కావడం లేదని, ఇక థర్డ్ వేవ్ వస్తే అతడిని జీవితాంతం కోలుకోనివ్వదని భయపడి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.