పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 మధ్య జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత ప్రభుత్వ సిఫార్సుపై రాష్ట్రపతి, 22 జూలై, 2024 నుండి 12 ఆగస్టు, 2024 వరకు బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటు ఉభయ సభలను పిలిపించే ప్రతిపాదనను ఆమోదించారని అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించిన మొదటి బడ్జెట్ ఇదే. బడ్జెట్ లో దేశ ప్రజలకు మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్-బీహార్ లకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.