సంచలన నిర్ణయం తీసుకున్న యడియూరప్ప

BS Yediyurappa quits as Karnakata CM. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి

By Medi Samrat  Published on  26 July 2021 7:32 AM GMT
సంచలన నిర్ణయం తీసుకున్న యడియూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేవారు. తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఈరోజు జరిగిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని, కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందని అన్నారు.

తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని..ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని అయినప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపానని అన్నారు. కర్ణాటక ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని యడియూరప్ప అందించనున్నారు. సోమ‌వారం లంచ్ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ట్లు యడియూరప్ప చెప్పారు. రాజీనామా చేస్తున్నాన‌ని చెప్పే స‌మ‌యంలో ఆయ‌న కాస్త భావోద్వేగానికి గుర‌య్యారు. య‌డ్యూర‌ప్ప‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్నార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న వార్తలు నిజమయ్యాయి.


Next Story