డీకే శివకుమార్‌తో బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి భేటీ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు.

By Medi Samrat  Published on  29 Sept 2023 4:53 PM IST
డీకే శివకుమార్‌తో బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి భేటీ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఛ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. మోత్కుపల్లి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో మోత్కుపల్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించాల‌ని బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ పై మోత్కుపల్లి ఫైర్ అయిన విష‌యం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలని కేసీఆర్ ను ఆయన డిమాండ్ చేశారు. ఆపై రేవంత్‌తో సాన్నిహిత్యంపై కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. రేవంత్ త‌న త‌మ్ముడు లాంటి వాడ‌ని అన్నారు. దీంతో ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటిని బ‌ల‌ప‌రుస్తూ మోత్కుప‌ల్లి బెంగళూరులో డీకేను కలవడంతో కాంగ్రెస్ లో ఆయన చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.

Next Story