సోదరిపై ఉన్న ప్రేమతో అతను చేసిన పని తెలిస్తే?

Brother Took His Sister With Helicopter In mumbai. సాధారణంగా ఒక కుటుంబంలో నివసించే అన్నాచెల్లెళ్ళు ఎప్పుడూ

By Medi Samrat
Published on : 16 Dec 2020 1:29 PM IST

సోదరిపై ఉన్న ప్రేమతో అతను చేసిన పని తెలిస్తే?

సాధారణంగా ఒక కుటుంబంలో నివసించే అన్నాచెల్లెళ్ళు ఎప్పుడూ గొడవలు పడుతూ, పోట్లాడుకుంటూ ఉంటారు. కానీ వారి చెల్లెళ్లను లేదా అక్కలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత వారి మధ్య ఒక్కసారిగా ప్రేమానురాగాలు పెరిగిపోతాయి.అప్పుడు తన సోదరి కోసం ఎలాంటి పని చేయడానికైన సిద్ధంగా ఉంటారు. ఇలాంటి తరుణంలోనే ఓ సోదరుడు తన సోదరికి వివాహం చేసి అత్తవారింటికి పంపించాడు. అయితే కొత్తగా పెళ్లి అయిన తన సోదరిని పుట్టింటికి తీసుకురావడానికి సాధారణంగా అయితే ఈ బైక్ లేదా కారులో వెళ్లి పుట్టింటికి తీసుకువస్తారు.కానీ ఈ సోదరుడు మాత్రం కొంచెం భిన్నంగా ఆలోచించి తన సోదరిని పుట్టింటికి తీసుకురావడానికి ఏకంగా హెలికాప్టర్ ను తీసుకు వెళ్ళాడు.

జల్గావ్‌ జిల్లాకు చెందిన శివాని కావడియా అనే యువతికి పర్లీలోని వైజ్యనాథ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న జైన్‌ కుటుంబానికి చెందిన డాక్టర్‌ కుణాల్‌ జైన్‌ తో గత కొద్ది రోజుల క్రితం వివాహం జరిగింది.అయితే అన్ని లాంచనాలతో అత్తారింటికి వెళ్ళిన తన సోదరిని పుట్టింటికి తీసుకురావడానికి తన సోదరుడైన విరాజ్‌ కావడియా అందరిలా బైక్ లేదా కారులో వెళ్లకుండా కొంత భిన్నంగా ఆలోచించాడు.

తన సోదరిని పుట్టింటికి తీసుకురావడానికి విరాజ్‌ కావడియా ఏకంగా ఒక హెలికాప్టర్ ను అద్దెకు తీసుకొని తన సోదరి గ్రామానికి వెళ్ళాడు. హెలికాప్టర్ ను ఊరు బయటున్న బారిస్టర్‌ నికం మైదానంలో ఒక్కసారిగా హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో ఆ ఊరు ప్రజలందరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే కాసేపటికి తన సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చాడన్న విషయం తెలుసుకొని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విధంగా విరాజ్ తన సోదరి పై ఉన్న ప్రేమను తెలియజేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Next Story