రోడ్డు లేదు కానీ బ్రిడ్జి అయితే కట్టేశారు.. ఏ రాష్ట్రంలోనో తెలుసా..?

పంట పొలంలో బ్రిడ్జిని కట్టడం షాకింగ్ గా అనిపిస్తోంది. ఆ బ్రిడ్జికి ఇరువైపులా ఎలాంటి రోడ్డు కూడా లేదు.

By Medi Samrat  Published on  6 Aug 2024 3:15 PM GMT
రోడ్డు లేదు కానీ బ్రిడ్జి అయితే కట్టేశారు.. ఏ రాష్ట్రంలోనో తెలుసా..?

పంట పొలంలో బ్రిడ్జిని కట్టడం షాకింగ్ గా అనిపిస్తోంది. ఆ బ్రిడ్జికి ఇరువైపులా ఎలాంటి రోడ్డు కూడా లేదు. అయితే ఎందుకు కట్టారో.. ఎవరి కోసం కట్టారో చుట్టుపక్కల వాళ్లను అడిగినా కూడా ఎలాంటి సమాధానం రాలేదు. బీహార్‌లోని అరారియా జిల్లాలోని రాణిగంజ్‌లోని ఒక గ్రామంలో 35 అడుగుల వంతెన నిర్మాణం చేశారు. అయితే ఇది ఎందుకు నిర్మించారో చెప్పాలని స్థానిక అధికారులను జిల్లా యంత్రాంగం నివేదిక కోరింది.

సీఎం గ్రామీణ సడక్‌ పథకం కింద పర్మానంద్‌పూర్‌ గ్రామంలో 2.5 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు ప్రారంభించామని, అయితే స్థానిక రైతుల నుంచి భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. వంతెన ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండాలి. అక్కడ రహదారిని నిర్మించిన తర్వాత కూడా పొలాలకు నీటిని తరలించేందుకు ఆ బ్రిడ్జిని వాడాలని భావించారు. ఇప్పటికే భూమిని సేకరించిన స్థలంలో వంతెనను నిర్మించగా, రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ఇంకా పూర్తికాకపోవడంతో ఇరువైపులా ఎలాంటి రోడ్డు నిర్మించలేదని స్థానిక అధికారులు అంటున్నారు. మొదట భూమిని సేకరించి, రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించే బదులుగా.. సేకరించిన భూమిలో 35 అడుగుల వంతెనను నిర్మించిందని గ్రామీణ పనుల శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు గురించి గ్రామస్థులకు పెద్దగా అవగాహన లేదని తెలుస్తోంది.

Next Story