Video : పోలీసు స్టేషన్‌లోనే భర్త గొంతు పట్టుకున్న లేడీ బాక్సర్

హర్యానాలోని హిసార్‌లోని ఒక పోలీస్ స్టేషన్ లోపల బాక్సర్ స్వీటీ బూరా తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హుడాపై దాడి చేస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి.

By Medi Samrat
Published on : 25 March 2025 8:15 PM IST

Video : పోలీసు స్టేషన్‌లోనే భర్త గొంతు పట్టుకున్న లేడీ బాక్సర్

హర్యానాలోని హిసార్‌లోని ఒక పోలీస్ స్టేషన్ లోపల బాక్సర్ స్వీటీ బూరా తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హుడాపై దాడి చేస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన మార్చి 15న జరిగింది. తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బూరా హుడా నుండి విడాకుల కోసం స్వీటీ కోర్టును ఆశ్రయించింది.

వైరల్ గా మారిన వీడియోలో స్వీటీ హుడా వైపు దూసుకువచ్చి అతని గొంతు పట్టుకుని దాడి చేసింది. పోలీస్ స్టేషన్ లోపల తీవ్ర వాగ్వాదానికి దిగడంతో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీయాల్సి వచ్చింది.

మార్చి 11న తాను హుడాతో కలిసి జీవించడం లేదని హిసార్ ఎస్పీకి తెలియజేసినట్లు బూరా చెప్పింది. తనకు విడాకులు, తాను దీపక్ కు ఇచ్చినవి మాత్రమే కావాలి తప్ప మరేమీ కావాలని కోరుకోలేదని తెలిపింది. మార్చి 15న విచారణ సందర్భంగా తనపై దాడి జరిగిందని, తనను హిసార్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని హుడా చెప్పారు. “ప్రశ్నల సమయంలో, నా భార్య ఆమె తండ్రి అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రారంభించారు. పోలీసుల సమక్షంలోనే నాపై దాడి చేశారు.” అని హుడా అన్నారు. బూరా, హుడా 2022లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు అథ్లెట్లు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గ్రహీతలు. బూరా మిడిల్ వెయిట్ విభాగంలో మాజీ ప్రపంచ ఛాంపియన్ కాగా, హుడా ప్రో కబడ్డీ లీగ్‌ ద్వారా పాపులారిటీని దక్కించుకున్నాడు.


Next Story