రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటేనే గోవా లోకి ఎంట్రీ
Both COVID-19 vaccine doses mandatory for tourists visiting Goa. గోవా ట్రిప్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? రెండు డోసుల కోవిద్-19
By Medi Samrat Published on 25 Jun 2021 6:18 PM ISTగోవా ట్రిప్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? రెండు డోసుల కోవిద్-19 వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఇకపై గోవాలోకి ఎంట్రీ అని అంటున్నారు అధికారులు. COVID-19 ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత గోవాను సందర్శించాలని అనుకుంటే మాత్రం రెండు డోసుల టీకాలు వేసుకోవాల్సిందే. పర్యాటకులకు రెండు డోసుల టీకాలు వేయడం తప్పనిసరి చేయాలని గోవా ప్రభుత్వం యోచిస్తోంది. గోవా సందర్శించే వారు కూడా ఆర్టీ-పిసిఆర్ నివేదికను తయారు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఓడరేవు మంత్రి మైఖేల్ లోబో గురువారం చెప్పారు.
జూలై వరకు కేసులు తగ్గుదలకు వేచి ఉండాల్సిన అవసరం ఉందని.. మరియు కేసుల సంఖ్య మరింత తగ్గనివ్వాలని అన్నారు. సరైన స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాత పర్యాటకుల కోసం మేము గోవాను తిరిగి తెరుస్తాము.. రెండు డోసుల టీకాలు వేయించుకున్న వాళ్లే కాకుండా RT-PCR నివేదికలు ఉన్న పర్యాటకులకు అనుమతులు మొదటి మూడు నెలలు తప్పనిసరి చేయబడతాయని లోబో చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవడంతోపాటు నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ తీసుకురావాల్సిందేనని లోబో స్పష్టం చేశారు.
తొలి మూడు నెలల పాటు రెండు డోసుల వ్యాక్సిన్‌తోపాటు నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తాం అని లోబో వెల్లడించారు. అయితే కొవిడ్ కేసులు తగ్గుతున్నా కనీసం రెండు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని, కనీసం నెల రోజుల తర్వాతే టూరిజం ఓపెన్ చేస్తామని అన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో మాత్రం ప్రొటోకాల్ మారుతుందని లోబో చెప్పారు. జూన్ 19 న, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కరోనా కర్ఫ్యూను జూన్ 28 వరకు పొడిగించారు. 18-44 సంవత్సరాల వయస్సులో ఉన్న జనాభాకు కనీసం మొదటి మోతాదు COVID-19 వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే గోవాలో పర్యాటక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని సావంత్ చెప్పారు. గోవాలో కొత్తగా 229 COVID-19 కేసులు, 258 రికవరీ అవ్వగా.. 9 మరణాలు నమోదయ్యాయి.