Bomb Threat : శంషాబాద్ స‌హా ప‌లు ఎయిర్ పోర్టుల‌కు బాంబు బెదిరింపులు

దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

By -  Medi Samrat
Published on : 12 Nov 2025 7:20 PM IST

Bomb Threat : శంషాబాద్ స‌హా ప‌లు ఎయిర్ పోర్టుల‌కు బాంబు బెదిరింపులు

దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్టులను పేల్చేస్తామని అగంతకులు ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్స్ ఐదు ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో సహా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

కొద్దిరోజుల కిందట కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు బెదిరింపుకాల్ కలకలం రేపింది. లండన్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోనే విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. ప్రయాణికులను కిందికి దింపి బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని సెక్యూరిటీ అధికారులు నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు ఈ మెయిల్‌పై దర్యాప్తు చేపట్టారు.

Next Story