ముఖ్యమంత్రి ఇంటి దగ్గర బాంబు

Bomb Found Near Punjab Chief Minister's House In Chandigarh. పంజాబ్ రాష్ట్రంలో ఉగ్ర కుట్ర భగ్నమైంది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం

By Medi Samrat  Published on  2 Jan 2023 8:30 PM IST
ముఖ్యమంత్రి ఇంటి దగ్గర బాంబు

పంజాబ్ రాష్ట్రంలో ఉగ్ర కుట్ర భగ్నమైంది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం వద్ద బాంబును గుర్తించారు. లైవ్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబును గుర్తించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నివాసం వద్ద భద్రత పెంచారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలో సోమవారం బాంబు దొరికింది. ఈ ప్రాంతం అత్యంత భద్రతతో కూడుకున్న ప్రాంతం. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం కూడా సమీపంలోనే ఉంది. పంజాబ్, హర్యానా సెక్రటేరియట్, అసెంబ్లీ కూడా బాంబు దొరికిన ప్రదేశానికి సమీపంలోనే ఉన్నాయి.


Next Story