రూ. 90 లక్షల బీఎండబ్ల్యూ కారును చెత్త బండిగా మార్చేసిన వ్యాపార‌వేత్త‌.. ఎందుకంటే..?

Bmw Luxury Carrying Car garbage Jharkhand Ranchi. ఓ యువ వ్యాపారవేత్త త‌న తండ్రికి కారును గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని అనుకున్నాడు

By Medi Samrat  Published on  24 Nov 2020 7:58 AM GMT
రూ. 90 లక్షల బీఎండబ్ల్యూ కారును చెత్త బండిగా మార్చేసిన వ్యాపార‌వేత్త‌.. ఎందుకంటే..?

ఓ యువ వ్యాపారవేత్త త‌న తండ్రికి కారును గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని అనుకున్నాడు. అంతే.. రూ.90ల‌క్ష‌లు పెట్టి బీఎండ‌బ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇంత‌లో ఓ అవాంతం వ‌చ్చింది. అంతే విసిరి వేసారిన యువ వ్యాపార వేత్త.. ఆ ఖ‌రీదైన కారులో చెత్త ఎత్తుతూ త‌న నిరస‌న తెలియ‌జేస్తున్నాడు. ఇంత‌కీ ఆ అవాంత‌రం ఏమిటీ..? ఇది ఎక్క‌డ జ‌రిగిందో చూద్దాం..

జార్ఖండ్‌లోని‌ రాజధాని రాంచీలో ఈ ఘటన జరిగింది. నగరానికి చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్ శ్రీవాస్తవ తన తండ్రికి బహుమానంగా ఇచ్చేందుకు రూ. 90 లక్షలు ఖర్చు చేసి బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. కానీ తండ్రికి ఇద్దామనుకునేలోపే ఆ కారు కొన్నప్పటి నుంచి తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. కారులో టెక్నికల్ సమస్యలు ఎక్కువై తెగ చికాకు పెట్టేసాయి. సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగడం తప్ప మరో పని లేకుండా పోయింది.

ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా మరో కొత్త సమస్య బయటపడుతోంది. దీంతో షోరూంకు తీసుకెళ్లడానికి అతడికి, దానిని మరమ్మతు చేయలేక షోరూం సిబ్బందికి విసుగొచ్చింది. దీంతో విసిగిపోయిన శ్రీవాస్తవ ఇలా లాభం లేదనుకుని లక్షలు పోసి కొన్న కారును చెత్త బండిగా మార్చేసి బీఎండబ్ల్యూ కంపెనీపై నిరసన వ్యక్తం చేశాడు. వీధుల్లో చెత్తను ఏరి దానిని కారు డిక్కీలో నింపుతూ నిరసన తెలిపాడు.

అంతేకాదు, 'చెత్తబండి వచ్చింది చెత్త తీసుకురండి' అంటూ పెద్ద శబ్దంతో పాటలు కూడా పెడుతుండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై ప్రిన్స్ మాట్లాడుతూ క్రికెటర్స్ ఈషాన్ కిషన్, రంజీ క్రికెటర్ అజాతశత్రు కార్లలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని తెలిపారు. తరచూ కారుకు మరమ్మతు చేయించాల్సి వస్తున్నదని, ఇందుకు లెక్కకుమించి ఖర్చు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కంపెనీపై కోర్టుకు వెళ్తానని తెలిపారు.


Next Story