ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు భయాందోళనలను సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయినట్లు సమాచారం అందుతుంది. పేలుడు కారణంగా సమీపంలోని దుకాణాల తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. పేలుడు కారణంగా పలు బస్సులు, ఇతర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం ప్రకారం.. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో కారులో పేలుడు సంభవించినట్లు కాల్ వచ్చింది, ఆ తర్వాత మూడు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. కారు పేలుడు గురించి తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.