సువేందు అధికారి.. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా వినిపించిన పేరు..! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నమ్మిన బంటుగా ఉన్న సువేందు అధికారి ఈ ఎన్నికల సమయంలో బీజేపీ చెంతన చేరారు. ఆ తర్వాత దీదీపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా నందిగ్రామ్ లో పోటీ చేసి గెలవమని సవాల్ విసిరారు. మమతా బెనర్జీ అతడి సవాల్ ను స్వీకరించి నందిగ్రామ్ లో పోటీ చేసి మరీ ఓడిపోయారు. ఇప్పుడు సువేందు అధికారిపై దొంగతనం కేసు నమోదైంది.
కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే సహాయ సామగ్రిని కాజేశారంటూ కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఫిర్యాదు చేయడంతో సువేందు, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై సువేందు అధికారిపై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్వ మిడ్నాపూర్ జిల్లాలోని కాంతి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సువేందు, మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు మార్గనిర్దేశాలతో మే 29 మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాలిటీ ఆఫీసు గోదాములోకి ప్రవేశించారని.. పేదలకు పంచాల్సిన పునరావాస సామగ్రిని ఎత్తుకెళ్లిపోయారని మన్నా ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 1న సువేందుపై పోలీసులు కేసు నమోదు చేశారు.