కాంగ్రెస్‌ నేత కామెంట్లపై దద్దరిల్లిన పార్ల‌మెంట్

BJP's Smriti Irani demands apology from Congress.రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధిర్‌ రంజన్ చేసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2022 7:29 AM GMT
కాంగ్రెస్‌ నేత కామెంట్లపై దద్దరిల్లిన పార్ల‌మెంట్

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధిర్‌ రంజన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై గురువారం పార్ల‌మెంట్ ద‌ద్ద‌రిలింది. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని కాంగ్రెస్ పార్టీ అవ‌మాన ప‌రిచింద‌ని, అధిర్‌ రంజన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌స‌భ‌లో డిమాండ్ చేశారు. దీనిపై ఉభ‌య స‌భ‌లు ద‌ద్ద‌రిల్లాయి. పార్ల‌మెంట్‌లో బీజేపీ స‌భ్యులు నిర‌స‌న‌కు దిగారు. దీంతో ఈ రోజు కూడా వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది.

ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో నిర‌స‌న తెలుపుతోన్న బీజేపీ ఎంపీల‌కు ఆమె మ‌ద్ద‌తు తెలిపారు. కావాల‌నే అలాంటి అభ్యంత‌ర వ్యాఖ్య చేశార‌ని, దీనిపై సోనియా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

ఆమె రాష్ట్రపతి కాదని, 'రాష్ట్రపత్ని' అంటూ కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్‌ రంజన్‌ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. 'తన ‍వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ' ఆవేశంగా మాట్లాడారు. పొర‌పాటున నోరు జారిన‌ట్లు తెలిపారు. ధ‌ర‌ల పెరుగుద‌ల, జీఎస్టీ, అగ్నిప‌థ్ పై ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే ఈ విష‌యాన్ని బీజేపీ పెద్ద‌ది చేస్తోంద‌న్నారు.

నిర‌స‌న‌ల‌పై సోనియా స్పందించారు. అధిర్ ఎప్పుడో క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని సోనియా అన్నారు.

Next Story