రాజకీయాలను వదిలిపెట్టేసిన హర్ష వర్ధన్

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హర్షవర్ధన్ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు.

By Medi Samrat  Published on  3 March 2024 3:00 PM GMT
రాజకీయాలను వదిలిపెట్టేసిన హర్ష వర్ధన్

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హర్షవర్ధన్ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటించే వివరణాత్మక పోస్ట్‌లో.. ముప్పై సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో గొప్ప విజయాలను సాధించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

69 సంవత్సరాల హర్ష వర్ధన్ తాను వైద్య వృత్తికి తిరిగి చేపడతానని తెలిపారు. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతో ఉంటాయని నాకు తెలుసు.. నా ENT క్లినిక్ నా పునరాగమనం కోసం కూడా ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో, నలుగురు సిట్టింగ్ ఎంపీలు - పర్వేష్ వర్మ, రమేష్ బిధూరి, మీనాక్షి లేఖి, హర్షవర్ధన్‌లను తొలగించడం ద్వారా బీజేపీ ఢిల్లీలో చాలా మార్పులను తీసుకుని వచ్చింది. పార్టీ తమ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చింది.

Next Story