సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. శకుంతల అరెస్ట్

BJP Worker arrested for objectionable Tweet Against CM Siddaramaiah. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్యకర్త శకుంతలను

By Medi Samrat  Published on  28 July 2023 10:08 PM IST
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. శకుంతల అరెస్ట్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్యకర్త శకుంతలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపి కళాశాల ఘటనను బీజేపీ తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోందని కాంగ్రెస్ నేత పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన శకుంతల... సిద్ధరామయ్య భార్యకో, ఆయన మనవరాలికో ఇలా జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శకుంతలను అరెస్ట్ చేశారు.

ఉడుపిలోని ఓ ప్రయివేటు కాలేజీ టాయిలెట్‌లో ముగ్గురు విద్యార్థులను రహస్యంగా వీడియో రికార్డ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరుగుదొడ్డిలో ఒక విద్యార్థి ఫోన్ దొరకగా, దానిని పరిశీలించిన యాజమాన్యం అందులో ఎలాంటి అనుమానించదగిన డేటా లేదని నిర్ధారించింది. విద్యార్థిని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. వీడియో తీసినట్లుగా అనుమానం ఉన్న ముగ్గురిని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ ఇది చిన్న ఘటన అని, ఆందోళన అవసరం లేదన్నారు. కొంతమంది స్నేహితుల మధ్య జరిగిన ఘటనకు రాజకీయ రంగు పూశారన్నారు. బీజేపీ కార్యకర్త శకుంతల నటరాజ్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఆమెపై కాంగ్రెస్ కార్యకర్త హనుమంతరాయ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.


Next Story