ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీ కైవసం

రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ను భారతీయ జనతా పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.

By Medi Samrat
Published on : 25 April 2025 4:15 PM IST

ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీ కైవసం

రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ను భారతీయ జనతా పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రాజా ఇక్బాల్ సింగ్ ఢిల్లీ కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు.ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎన్నికలను బహిష్కరించడంతో, మొత్తం 142 ఓట్లలో 133 ఓట్లను దక్కించుకున్న బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది. సింగ్ ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మన్దీప్ కేవలం ఎనిమిది ఓట్లను మాత్రమే సాధించారు. ఒక ఓటు చెల్లదని ప్రకటించారు.

గత ఏడాది నవంబర్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మహేశ్ కుమార్ ఖించి కేవలం 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ఎంసీడీలోని మొత్తం 250 సీట్లలో బీజేపీ బలం 117 కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ బలం 113గా ఉంది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా 11 మంది బీజేపీ, ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఎలెక్టర్లుగా నామినేట్ చేశారు. గత మూడేళ్లలో బీజేపీ బలం 104 నుంచి 117కు పెరగగా, ఆమ్ ఆద్మీ పార్టీ బలం 134 నుంచి 113కు తగ్గింది. MCD ప్రస్తుత బలం 238 వద్ద ఉంది, కొంతమంది కౌన్సిలర్లు ఢిల్లీ అసెంబ్లీకి, ఒకరు లోక్‌సభకు ఎన్నికైనందున 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 250 సీట్లలో, బీజేపీ ఇప్పుడు 117 కౌన్సిలర్లను కలిగి ఉంది, 2022లో ఆ పార్టీకి 104 మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే, అయితే AAP సంఖ్య 134 నుండి 113కి తగ్గింది. కాంగ్రెస్ ఎనిమిది సీట్లను మాత్రమే కలిగి ఉంది.

Next Story