బీహార్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది : లాలూ

BJP will be wiped out from Bihar in 2024 LS elections. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు

By Medi Samrat
Published on : 24 Sept 2022 3:52 PM IST

బీహార్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది : లాలూ

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం అన్నారు. పాట్నా విమానాశ్రయంలో లాలూ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. 2024లో బీజేపీని ఓడించ‌డం ఖాయం అని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ చికిత్స కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఉండి.. గత నెలలో పాట్నాకు తిరిగి వచ్చారు. సోమవారం కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లాల్సి ఉంది.

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఆదివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఆయన వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రానున్నారు. 2024లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఇద్దరు నేతలు కాంగ్రెస్ చీఫ్‌కి వివరించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలవనున్నారు ఇద్ద‌రు నేత‌లు.


Next Story